మధ్యప్రదేశ్లో విషాదకరమైన ఘటన జరిగింది. చాక్లెట్ ఆశచూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక.. కిరాతకంగా చంపాడు ఓ దుండగుడు. శివపురి జిల్లా తెందువా పోలీస్స్టేషన్ పరిధిలోని ఇమాలియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
చాక్లెట్ ఆశచూపి..
ఇమాలియా గ్రామానికి చెందిన ఉత్తమ్ నారాయణ్(35).. పక్కింట్లో ఒంటరిగా ఉన్న బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఉన్న గోధుమ కంటైనర్లో పడేశాడు.