తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం! - rape in up muzaffarnagar

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. మామిడి కాయలు ఇస్తానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగింది.

raped in UP village
బాలికపై అత్యాచారం

By

Published : Jun 12, 2021, 4:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​నగర్​లోని ఓ గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. పొరుగింటి వ్యక్తే ఈ దారుణానికి ఒడికట్టాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

నిందితుడు కపిల్​కుమార్ బాలిక ఇంటి పక్కనే ఉంటాడు. చిన్నారికి మామిడి కాయలు ఇస్తాను అని ఆశ చూపి శుక్రవారం తనతో తోటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది.

దీనిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భోపా పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. అత్యాచారం, బెదిరింపు, పోక్సో చట్టం కింద కపిల్​ కుమార్​పై కేసు నమోదు చేసినట్లు స్టేషన్​ హౌస్​ అధికారి దీపక్ చతుర్వేది చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'కరోనా మాతా.. నువ్వే రక్షించాలమ్మా'

ABOUT THE AUTHOR

...view details