తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడేళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం.. ఆపై నేలకేసి కొట్టి హత్య - భార్యను చంపిన భర్త

ఎనిమిదేళ్ల బాలుడు.. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. అనంతరం పాపను నేలకేసి కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

8-year-old-boy-tried-to-rape-3-year-old-girl-in-uttarpradesh
మూడేళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడు అత్యాచార యత్నం

By

Published : May 28, 2023, 8:49 PM IST

Updated : May 28, 2023, 10:07 PM IST

మూడేళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ఆనంతరం ఆమెను నేలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఆరు రోజుల చికిత్స తరువాత ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందిడుడిని అరెస్ట్ చేసి జువైనల్​ హోంకు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పుర్​ జిల్లాలోని చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు, బాధితురాలి ఇంటి పక్కనే నినాసం ఉండేవాడు. ఆహారం మే22న చాక్లెట్​ ఇస్తానని చెప్పి చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆ తర్వాత నేలకోసి కొట్టాడు. ఎంతకీ చిన్నారి ఇంటికి రాకపోవడం గమనించిన ఆమె కుటుంబసభ్యుల ఆందోళన చెందారు. పాపను వెతుక్కుంటూ చుట్టుపక్క ప్రాంతాలు పరిశీలించారు. అనంతరం ఓ చెట్టుపక్కన గాయాలతో పడి ఉన్న చిన్నారి గుర్తించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి ఆమెను తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి శనివారం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసుల ఫిర్యాదు చేశారు చిన్నారి కుటుంబ సభ్యులు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడ్ని అరెస్ట్​ చేసి కోర్టు ఆదేశాలతో జువైనల్​ హోంకి తరలించారు.

భార్యను చంపి.. మృతదేహాన్ని నాలుగో అంతస్తు నుంచి కిందకి పడేసిన భర్త..
వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను హత్య చేశాడు ఓ భర్త. అనంతరం మృతదేహాన్ని నాలుగో అంతస్తు నుంచి కిందకి పడేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. గుజరాత్​లోని సూరత్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్​ (29), అతడి భార్య రాజ్​కుమారి.. సార్థనా పోలీస్ స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్నారు. రమేశ్​ భార్యకు ఓ లారీ డ్రైవర్​తో వివాహేతర సంబంధం ఉండేది. ఆ విషయం తెలిసిన భర్త,. పలుమార్లు భార్యను మందలించాడు. అయిన ఆమె తన పద్దతిని మార్చుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త.. రాజ్​కుమారిని హత్య చేశాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పారు. కుమారుల్లో ఒకరిది ఏడేళ్ల వయస్సు వారు కాగా.. మరొకరిది మూడేళ్ల వయస్సు. నిందితుడు రమేశ్​ టెంపోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు వివరించారు.

సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య.. పెళ్లిరోజునే దారుణం..
ఛత్తీస్​గఢ్​.. కోర్బాలో దారుణం జరిగింది. సుపారీ ఇచ్చి కట్టుకున్న భర్తను హత్య చేయించింది ఓ భార్య. పెళ్లిరోజునే భర్తను హత్య చేయించింది. అనంతరం పోలీసుల ఎదుట కట్టుకథలు అల్లింది. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఆఖరికి పట్టుబడింది. అసలు నిందితురాలు ఆమె భర్తను ఎందుకు చంపించిందో? భర్తను చంపేందుకు ఎంత సుపారీ ఇచ్చిందో? తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : May 28, 2023, 10:07 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details