అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఈ ప్యానెల్‌కు దిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్ వీఎస్ రాజు నేతృత్వం వహించనున్నారు. నిర్మాణ రంగంలో నిపుణలు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. వీరు ఆలయానికి సంబంధించిన పునాది, ఇతర నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. వివిధ వర్గాల వారి నుంచి వచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకొని నాణ్యమైన, వీలైనంత ఎక్కువ రోజులు ఉండేలా ఆలయాన్ని నిర్మించడమే లక్ష్యంగా ట్రస్ట్ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
రామాలయ నిర్మాణ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ట్రస్ట్ విడుదల చేసినట్లు అయోధ్య భాజపా ఎమ్మెల్యే వేద్ గుప్తా తెలిపారు.
ఇవీ చూడండి: