కర్ణాటక బెంగళూరులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న 8 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కెంగేరి, సోలదేవనహళ్లి ప్రాంతాల్లో విదేశీ మహిళలు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ ప్రాంతాల్లో స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు.
విదేశీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. బార్‌లోని సీక్రెట్ రూంలో 21 మంది యువతులు
కర్ణాటకలో ఓ విదేశీ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు మహిళలతో పాటుగా ఆరుగురు పురుషులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని ఓ బార్ని దాడులు నిర్వహించిన పోలీసులు.. రహస్య నిర్మాణంలో దాచి ఉంచిన కొందరు మహిళను గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి బంగాల్, త్రిపురకు చెందినట్లు ఆధార్ కార్టులతో పాటు.. బంగ్లాదేశ్‌కు చెందిన కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లభ్యమయ్యాయి. వీరు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను ప్రాథమికంగా విచారించగా వారంతా భారతీయులమేనని వెల్లడించినట్లు క్రైమ్ బ్రాంచ్ కమిషనర్ ఎస్డీ శరణప్ప తెలిపారు.
బార్లో దాడులు.. పట్టుబడిన 21మంది మహిళలు..
మహారాష్ట్ర ముంబయిలోని ఓ బార్‌పై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడిలో 21 మంది మహిళలను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 17 మంది రహస్య నిర్మాణంలో ఉండగా.. నలుగురు బార్లో డ్యాన్స్‌లు చేస్తున్నారని తెలిపారు. వీరితో పాటు బార్ మేనేజర్, ఆరుగురు సిబ్బందితో పాటు 19 మంది కస్టమర్స్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.