Road Accident in UP: ఉత్తర్‌ప్రదేశ్ రెండు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రామ్‌పుర్ జిల్లాలో తండా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.
ఘటనా స్థలాన్ని పరీక్షిస్తున్న అధికారులు బాధితుడిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. మృతదేహాలను శవపరీక్ష కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ముగ్గురు పోలీసులు మృతి
ఉన్నావ్ జిల్లా సఫీపుర్ కొత్వాలి ప్రాంతంలో పోలీసు వాహనంపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించారు. మరొకరు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ సహా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు దుర్మరణం చెందారు.
సీఎం విచారం
ఈ ఘటనపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సాయం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి:బస్సు బోల్తా- 25 మందికి తీవ్ర గాయాలు