Several States Hiked DA for Govt Employees :కేంద్రం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్(DA) పెంచిన విషయం తెలిసిందే. దసరా బొనాంజగా 4% మేర డీఏ పెంచింది. ఇప్పుడు అదే బాటలో.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు దీపావళి బహుమతిగా డీఏ అందిస్తున్నాయి. దీంతో.. అక్కడి ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
DA Hike Latest Update :సంవత్సరానికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతారు. ప్రభుత్వం పరిస్థితులను బట్టి దీనిని వాయిదా వేయవచ్చు. సాధారణంగా ఆరు నెలల్లో డీఏ విడుదలవుతుంది. అంటే మొదటి డీఏ పెంపు జనవరిలో, రెండోది జూలైలో పెంచుతారు. అధిక ద్రవ్యోల్బణంతో ధరలు పెరుగుతున్న క్రమంలో.. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు డీఏ పెంచుతాయి. ఇటీవల కేంద్రం ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంచగా..దీపావళి(Diwali)వస్తున్న క్రమంలో ఇప్పుడు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు డీఏ పెంచి దివాళీ బోనస్ అందిస్తున్నాయి. ఏ రాష్ట్రాల్లో ఎంత మేర డీఏ పెరిగిందో ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు ఉద్యోగులకు డీఏ :తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వ ఉద్యోగులకు 4% DA పెంచారు. జులై 1, 2023 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. దీంతో దాదాపు 16 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు ఈ ఏడాది మేలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 4 శాతం పెంచగ్గా.. తాజాగా 4% డీఏ పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది.
ఒడిశా సర్కారు కూడా :ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర ఉద్యోగులకు కరువు భత్యాన్ని 4% పెంచారు. ఈ పెంపుతో డీఏ, డీఆర్‌లు 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగాయి. పెంచిన డీఏ జూలై 1, 2023 నుంచి వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ డీఏ పెంపు వల్ల ఒడిశాలోని 4.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. 3.5 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.