తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7th Pay Commission DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపునకు ముహూర్తం ఫిక్స్.? - త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

7th Pay Commission DA Hike Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. రెండో డీఏ పెంపు ప్రకటనకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. కేంద్రం అతి త్వరలోనే ఈ ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. మరి, ఇంతకీ ఎంత పెంచుతున్నారు? ఎప్పుడు ప్రకటిస్తున్నారు??

7th Pay Commission DA Hike
7th Pay Commission

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 4:39 PM IST

7th Pay Commission DA Hike Latest News : దేశంలోని కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. 2023 జులై డియర్‌నెస్ అలవెన్స్ (DA) ప్రకటన కోసం వీరందరూ ఎదురుచూస్తున్న చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది మొదటి డీఏ నాలుగు శాతం పెరగ్గా.. తాజాగా రెండో డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఎంత మొత్తంలో డీఏ(DA Hike) పెంచబోతున్నారు? పెంచిన డీఏను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

How Much DA Hike For Central Govt Employees : ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రెండుసార్లు పెంచుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా నెలవారీ జీతం, పెన్షన్ సంపద తగ్గుతున్న కొనుగోలు శక్తిని ఎదుర్కోవడానికి కేంద్ర సర్కార్ ప్రతి ఆరు నెలలకోసారి DA రేటును సవరిస్తుంది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ పెరిగినప్పుడల్లా.. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరుగుతుంది. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతం ఉండగా.. మరో 4 శాతం పెరిగితే డీఏ 46 శాతానికి చేరుకుంటుంది.

ఎప్పుడు ప్రకటిస్తారంటే.?

DA Hike Announcement Details Soon in October :కేంద్ర సర్కార్ దసరా, దీపావళి గిఫ్ట్​గా డీఏ పెంపు ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అక్టోబర్​లో డీఏ పెంచినా.. 2023 జులై నుంచి డీఏ వర్తిస్తుంది. ఈ నెలలో డీఏ పెంచితే జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల డీఏ బకాయిలు కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్​ 4 శాతం పెరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరుగనున్నాయి.

7th Pay Commission Central Govt Employees DA Hike : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ అంతనా..?

DA ఎలా లెక్కించబడుతుందంటే.?

DAను సాధారణంగా ఉద్యోగి ప్రాథమిక జీతంలో ఒక శాతంగా లెక్కిస్తారు. డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ((AICPI సగటు (ఆధార సంవత్సరం 2001=100) గత 12 నెలలు–115.76)/ 115.76)*100 ఈ ఫార్మాలా ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్​ను లెక్కిస్తారు.

7th Pay Commission :7వ వేతన సంఘం ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ అనేది రూ.18 వేల నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బేసిక్ శాలరీ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు ఎంత వరకు పెరిగే ఛాన్స్ ఉందో మనం ఒకసారి తెలుసుకుందాం.

  • డీఏ 4 శాతం పెరిగితే.. ఉద్యోగులు అందుకునే మొత్తం ఇలా ఉంటుంది.
  • కనీస వేతనం 18 వేల రూపాయలుగా ఉన్నవారికి.. DA రూ.720 మేర పెరిగే ఛాన్స్ ఉంది. అంటే.. ఏడాదికి రూ. 8,640 వరకు అందుకుంటారు.
  • బేసిక్ శాలరీ రూ. 56,900 ఉన్నవారు.. నెలకు 2,276 పొందుతారు. సంవత్సరానికి 27,312 రూపాయలు అందుకుంటారు.
  • అంటే.. అధిక మూల వేతనం కలిగిన వారికి డీఏ పెంపు కూడా ఎక్కువగా ఉంటుంది.

DA For TSRTC Employees : టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. 4.8 శాతంతో మరో డీఏ మంజూరు

DA hike for employees in Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఒక డీఏ మంజూరు

ABOUT THE AUTHOR

...view details