గోవా వైద్య కళాశాల ఆసుపత్రి(జీఎంసీహెచ్)లో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రాణవాయువు కొరతతో అక్కడ శుక్రవారం వేకువ జామున మరో 13 మంది మరణించారు. దీంతో గత నాలుగు రోజుల్లేనే ఆక్సిజన్ లేక మొత్తం 75 మంది కరోనా రోగులు చనిపోయారు.
ఈ ఆస్పత్రిలో కరోనా రోగుల మరణాలకు సంబంధించి బొంబాయి హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరగడం ఆందోళన కలిగిస్తోంది. జీఎంసీహెచ్‌లో రోగుల మృతికి గల కారణాన్ని గోవా ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే మెడికల్ ఆక్సిజన్‌ను రోగులకు సరఫరా చేసే విషయంలో లాజిస్టిక్ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గురువారం కోర్టుకు తెలిపింది.
జఎంసీహెచ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య కారణంగా మంగళవారం 26 మంది, బుధవారం 21 మంది, గురువారం 15 మంది, శుక్రవారం 13మంది కరోనా రోగులు చనిపోయారు.