Speak Mackay Founder Kiran Seth : కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన స్పీక్ మాకే సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కిరణ్ సేథ్ మరో ఇద్దరు సభ్యులతో కలిసి గురువారం రిషికేశ్ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజలు సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్ తొక్కడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక అభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు. అక్టోబరు 2 నాటికి తన సైకిల్‌యాత్ర దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు ఆయన 1,000 కి.మీ. ప్రయాణించారు. కిరణ్.. ఖరగ్‌పుర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆయన దేశీయ కళలు సంస్కృతికి ప్రపంచదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తుంటారు.
పర్యావరణ రక్షణపై యువతకు అవగాహన ...
పర్యావరణ రక్షణపై యువతకు అవగాహన కల్పించడానికి సైకిల్ యాత్ర చేపట్టారు 73 ఏళ్ల డాక్టర్ కిరణ్ సేథ్. ఈ వయసులో 1500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈ యాత్రలో దాదాపు 2500 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు. యువతకు పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికే సైకిల్ యాత్రను చేస్తున్నట్లు డాక్టర్ కిరణ్ సేథ్ తెలిపారు. సైకిల్‌తో కలిగే ప్రయోజనాలను యువతకు తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు.