తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లారీని ఢీకొట్టిన యాత్రికుల బస్సు- 75 మందికి గాయాలు - ఝార్ఖండ్​లో బస్సు ప్రమాదం తాజా సమాచారం

రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని యాత్రికుల బస్సు ఢీకొని.. 75 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఝార్ఖండ్​లోని హజారిబాగ్​లో జరిగింది.

bus accident in Jharkhand
బస్సు ప్రమాదం

By

Published : Nov 10, 2021, 11:27 AM IST

ఝార్ఖండ్​ హజారిబాగ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు.. రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనకునుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 75 మంది గాయపడ్డారు. వారిలో తొమ్మది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులంతా బంగాల్​కు చెందినవారిగా గుర్తించారు.

ఇదీ జరిగింది

బంగాల్​ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్​హట్​ ప్రాంతానికి చెందిన 75 మంది ఓ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. ఉత్తర్​ప్రదేశ్​లోని బృందావన్​ను సందర్శించుకుని.. బిహార్​లోని బోధ్​గయాకు వెళ్తుండగా.. ఝార్ఖండ్​, చౌపరన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని 2వ నంబరు జాతీయ రహదారిపై దనువా-భనువా ఘాట్ వద్ద సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. బస్సులోని యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. పలువురికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్​ చేశారు వైద్యులు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని హజారిబాగ్​ వైద్య కళాశాలకు తరలించాలని సూచించారు. అయితే అందుకు నిరాకరించిన బాధితుల బంధువులు.. వారిని బంగాల్​కు తీసుకెళ్లారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బస్సును సీజ్​ చేశారు.

ఇదీ చూడండి:సింఘు సరిహద్దులో రైతు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details