ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆమోద ముద్ర వేశారు. ప్రైవేటు సెక్టార్‌లో నెలకు రూ.50 వేల వేతనం కంటే తక్కువ వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఖట్టర్ ప్రభుత్వం గతేడాది ఉద్యోగకల్పనకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో గవర్నర్ ముందుకు వెళ్లింది. ఈ మేరకు గవర్నర్ మంగళవారం ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం.. సంబంధిత కంపెనీ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు చెందినవారితో 10% ఉద్యోగాలు, హరియాణాలోని ఇతర జిల్లాల వారితో మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. మొదటగా పదేళ్ల కాలానికి ఈ కోటాను వర్తింపజేస్తారు.
'ప్రైవేటు'లో 75% కోటాకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం - haryana 75 percent reservation
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఖట్టర్ ప్రభుత్వం గతేడాది ఉద్యోగకల్పనకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు గవర్నర్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం.. సంబంధిత కంపెనీ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు చెందినవారితో 10% ఉద్యోగాలు, హరియాణాలోని ఇతర జిల్లాల వారితో మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది.
'రాష్ట్రంలో స్థానికులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. త్వరలో దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేస్తాం' అని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, 2019 ఎన్నికల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని జేజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆ మేరకు భాజపా- జేజేపీ కూటమి ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ ముందుకు పంపడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.