తెలంగాణ

telangana

'కరోనా రెండో దశలో 719మంది వైద్యులు మృతి'

రెండో దశ కరోనా విలయం కారణంగా దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మరణించినట్లు భారత వైద్య సంఘం(ఐఎంఏ) తెలిపింది. అత్యధికంగా బిహార్​లో 111 మరణాలు నమోదైనట్లు తెలిపింది.

By

Published : Jun 13, 2021, 6:23 AM IST

Published : Jun 13, 2021, 6:23 AM IST

second wave  doctors death
'కరోనా రెండో దశలో 719 మంది వైద్యులు మృతి'

కరోనా రెండో దశ(Covid second wave) భారత్‌లో విలయం సృష్టిస్తోంది. సాధారణ పౌరులనే కాదు.. రోగులకు సేవలందించే వైద్యులపై కూడా పంజా విసురుతోంది. కొవిడ్‌ రెండో దశ సమయంలో దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు(Doctors) భారత వైద్య సంఘం (ఐఎంఏ) వెల్లడించింది. అత్యధికంగా బిహార్‌లో 111 మంది వైద్యులు కన్నుమూశారు. దిల్లీలో 109 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 79 మంది, బంగాల్‌లో 63 మంది డాక్టర్లు మృతిచెందినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసిన ఐఎంఏ.. తెలంగాణలో 36 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 35 మంది వైద్యులను కరోనా బలితీసుకున్నట్లు పేర్కొంది.

కొవిడ్‌ కారణంగా వైద్యులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఐఎంఏ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించేలా పని వాతావరణాన్ని కల్పించాలని ఈనెల 7వ తేదీన మోదీకి రాసిన లేఖలో అభ్యర్థించింది. 2020 నుంచి దేశవ్యాప్తంగా 1400 మందికి పైగా వైద్యుల కరోనా కారణంగా ప్రాణాలు కోల్పో యారని ఐఎంఏ మోదీ దృష్టికి తీసుకెళ్లింది.

ఇవీ చదవండి:కరోనాతో 1300మంది బ్యాంకు ఉద్యోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details