ఆయుష్మాన్ భారత్ పథకంలో కీలక మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. 70 వేల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం 2021, మార్చి 31 కన్నా ముందే పూర్తి చేసినట్లు వెల్లడించింది.
ఆయా కేంద్రాల ద్వారా 41.35 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందినట్లు పేర్కొంది వైద్య సాఖ. వీరిలో 54 శాతం మంది మహిళలు ఉండగా.. ఫోన్ ద్వారా మరో 9.45 లక్షల మందికి సేవలు అందినట్లు వివరించింది.
కరోనా కష్టకాలంలో కూడా ఈ సేవలను అనుకున్న సమయానికన్నా ముందే అందుబాటులోకి తీసుకురావటం కీలక విషయమని పేర్కొన్నారు అధికారులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఇది సాధ్యమైనట్లు స్పష్టం చేశారు. ప్రణాళిక బద్ధంగా దూరదృష్టితో పరస్పర సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనిలో సమస్యలను పర్యవేక్షించడం, వాటిన పరిష్కారించడం అన్నీ స్థాయులలో ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీలో కొత్త రికార్డ్