దిల్లీలో బుధవారం భారీ వర్షాలు కురవడం వల్ల.. మే నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఫలితంగా.. ఉష్ణోగ్రత 16 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. గత 70ఏళ్లలో మే నెల ఉష్ణోగ్రతలు ఇంత స్వల్పస్థాయికి చేరడమిదే తొలిసారని వాతవారణ విభాగం తెలిపింది.
అంతకుముందు.. 1982 మే13న కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8కి పడిపోయింది. 1951లో నమోదైన 23.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతే ఇంతవరకు అత్యల్పం కాగా.. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది.