తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆయనకు 75.. ఆమెకు 70.. పెళ్లయిన 54ఏళ్లకు ప్రసవం! - Baby Birth After 54 Years Of Marriage

పెళ్లయి 54 ఏళ్లు అవుతున్నా సంతాన భాగ్యం లేని వృద్ధ దంపతుల జీవితంలో అంతులేని సంతోషం నింపారు వైద్యులు. ఐవీఎఫ్​ విధానంలో 70 ఏళ్ల మహిళ గర్భం దాల్చేలా చేశారు. సోమవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫలితంగా వారి కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది.

Old Age Pregnancy Case
ఆయనకు 75.. ఆమెకు 70.. పెళ్లయిన 54ఏళ్లకు ప్రసవం!

By

Published : Aug 9, 2022, 6:06 PM IST

Updated : Aug 9, 2022, 7:08 PM IST

70 ఏళ్ల మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజస్థాన్​ అళ్వర్​లో సోమవారం జరిగిందీ ఘటన. తల్లిదండ్రులు కావాలన్న కల.. పెళ్లయిన 54 ఏళ్లకు నెరవేరగా ఆ వృద్ధ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఐవీఎఫ్​ విధానంలో ఈ అద్భుతాన్ని సాకారం చేసిన వైద్యులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

శిశువుకు పాలు తాగిస్తున్న డాక్టర్

దేశ సేవలో నిమగ్నమై..
వృద్ధాప్యంలో తల్లిదండ్రులైన ఈ దంపతులు గోపీచంద్​(75), చంద్రావతి(70). 1968లో వీరికి వివాహమైంది. అప్పట్లో గోపీచంద్ సైన్యంలో పనిచేసేవారు. పెళ్లయిన కొంతకాలానికి బంగ్లాదేశ్​ యుద్ధం రాగా.. ఆ విధులపై పంపింది ప్రభుత్వం. ఫలితంగా చాలాకాలం ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. యుద్ధం ముగిశాక కూడా సైనిక విధుల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో భార్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తల్లిదండ్రులు కావాలన్న గోపీచంద్, చంద్రావతి కల నెరవేరలేదు.

తండ్రి గోపీచంద్
గోపీచంద్-చంద్రావతి దంపతుల కుమారుడు

1983లో సైన్యం నుంచి పదవీ విరమణ పొందారు గోపీచంద్. తల్లిదండ్రులు కావాలన్న కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలని భార్యాభర్తలు అనుకున్నారు. అనేక మంది వైద్యుల్ని సంప్రదించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల అళ్వర్​లోని ఓ ప్రైవేటు ఐవీఎఫ్​ ఆస్పత్రి గురించి తెలుసుకున్నారు గోపీచంద్-చంద్రావతి. వెంటనే వెళ్లి అక్కడి వైద్యులను సంప్రదించారు. చికిత్స ఫలించింది. 70 ఏళ్ల వయసులో చంద్రావతి గర్భం దాల్చింది.
సోమవారం అళ్వర్​లోని ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది చంద్రావతి. శిశువు 3.5 కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:37ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 8వసారి సీఎంగా.. దటీజ్​ నితీశ్​!

Last Updated : Aug 9, 2022, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details