Bomb Blast In Bengal : బంగాల్ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పేలుడు సంభవించింది. రైలును లక్ష్యంగా చేసుకుని ట్రాక్ సమీపంలో బాంబు పెట్టగా.. ప్రమాదవశాత్తు పేలి ఏడేళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు పిల్లలు గాయాలపాలయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపంలో బాంబును పెట్టారని.. బాలుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుూ వెళ్లి డబ్బాను తెరవగా బాంబు పేలిందని పోలీసులు చెప్పారు. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించగా మరో బాంబు లభించిందని వెల్లడించారు.
ఈ ప్రమాదం కాకినార-జగద్దల్ స్టేషన్ల మధ్య ఉదయం 8గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు వైద్యులు. ఇద్దరు పిల్లలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.