తమిళనాడు తిరువళ్లూర్‌లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ బాలుడిని రెండు పాములు కాటు వేశాయి. అప్రమత్తమైన బాలుడి తండ్రి ఆ రెండు పాములను చంపి.. తన కుమారుడితో పాటే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
తిరువళ్లూర్ సమీపంలోని కొల్లకుప్పం గ్రామంలో ఎల్లమ్మాళ్, మణి దంపతులు నివసిస్తున్నారు. వీరికి మురుగన్(7) అనే కుమారుడు ఉన్నాడు. ఈ దంపతులు వృత్తిరీత్యా కూలీలు. శుక్రవారం రాత్రి మురుగన్ ఇంట్లో నిద్రిస్తుండగా రెండు పాములు కాటు వేశాయి. అది గమనించిన మురుగన్ తండ్రి మణి.. వెంటనే రెండు పాములను కొట్టి చంపేశాడు. అనంతరం తిరువళ్లూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మురుగన్‌తో సహా ఆ రెండు పాములను తీసుకెళ్లాడు. ప్రస్తుతం మురుగన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.