అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సియాంగ్ జిల్లా పాసిఘాట్ జైలులోని ఖైదీలు.. సినీ ఫక్కీలో పరారయ్యారు. ఆదివారం రాత్రి భోజనం సమయంలో గేట్లు తెరవగా.. ఏడుగురు ఖైదీలు పక్కనే ఉన్న పోలీసులపై కారం, మిరియాల పొడి చల్లి పరారయ్యారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన పోలీసులను ఆస్పత్రికి తరలించామని ఐజీపీ చుకు అపా తెలిపారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పోలీసుల కళ్లలో కారం కొట్టి ఖైదీలు జంప్ - ఖైదీలు పరార్
పోలీసుల కళ్లలో కారం కొట్టి ఏడుగురు ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది.

ఖైదీలు
పాసిఘాట్లో కర్ఫ్యూ విధించిన కారణంగా ఖైదీలు ఎక్కువ దూరం ప్రయాణించలేరని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తపంగ్ తతక్ తెలిపారు.
ఇదీ చదవండి:గర్భవతి కళ్లెదుటే దారుణ హత్య- సుప్రీం కీలక నిర్ణయం