ఉత్తర్ప్రదేశ్ సంభల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఆగ్రా- చందౌసీ రహదారిపై బాహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ఓ వివాహ వేడుకకు హాజరైన ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు టైరు పంక్చర్ అయింది. దీంతో లహరావన్ గ్రామం వద్ద దానిని నిలిపి ఉంచారు. ఆగి ఉన్న ఆ బస్సును మరో బస్సు ఢీకొనగా ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ చక్రేశ్ మిశ్రా తెలిపారు.