దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2(Covid New Variant in India) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఈ వేరియంట్(Covid New Variant in India) సోకినట్లు తేలింది. బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగతా నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.
ఏవై.4.2 కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కర్ణాటకలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వేరియంట్ బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు.. ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించనుందని చెప్పారు.
ప్రయోగశాలకు..
ఏవై.4.2 రకం(Covid New Variant in India) అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌కు వీటిని పంపినట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జన్యు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రంలో ఆరు లేదా ఏడు ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.