తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సివిల్స్​లో అమ్మాయిల సత్తా.. టాప్​ 3 ర్యాంకులు వారికే - సివిల్ సర్వీసెస్

Civil Services: 2021 సివిల్ సర్వీసెస్​ పరీక్షల్లో 685 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు యూపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ఈసారి పరీక్షల్లో మహిళా అభ్యర్థుల హవా కొనసాగింది. మొదటి మూడు ర్యాంకులు వారే దక్కించుకున్నారు.

civil services examination 2021
civils results 2022

By

Published : May 30, 2022, 3:24 PM IST

Civil Services: 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మహిళా అభ్యర్థులు సత్తాచాటారు. టాప్​ 3 ర్యాంకులు వారికే దక్కాయి. శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామిని సింగ్లా.. వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ మేరకు ఫలితాలను సోమవారం విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). మొత్తంగా 685 మంది అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది.

సివిల్స్​ సాధించినవారిలో జనరల్ కేటగిరీకి చెందినవారు 244, ఈడబ్ల్యూఎస్​ 73, ఓబీసీ 203, ఎస్సీలు 105, ఎస్టీలు 60 మంది ఉన్నట్లు కమిషన్ తెలిపింది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్​ఎస్ అధికారులను ఎంపిక చేసేందుకు ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది యూపీఎస్సీ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మెయిన్స్​ పరీక్ష ఈ ఏడాది జనవరిలో జరగగా, ఇంటర్వ్యూలను ఏప్రిల్​, మే నెలల్లో నిర్వహించారు. ఇక 80 మంది అభ్యర్థులను ప్రొవిజనల్​గా ఎంపిక చేయగా, ఒకరి ఫలితాన్ని మాత్రం నిలిపివేశారు.

ప్రధాని అభినందనలు:సివిల్స్​ సాధించిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. "2021 సివిల్స్​ ఉత్తీర్ణులకు అభినందనలు. అజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేళ భారత్​ అభివృద్ధి పథంలో పయనిస్తున్న దశలో కీలకమైన బాధ్యతలు చేపట్టబోతున్నందుకు శుభాకాంక్షలు." అని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​' పథకానికి మోదీ శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details