కరోనా రెండో దశ విజృంభణ కారణంగా దేశం ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటోంది. దీని వల్ల ఆక్సిజన్ ఆవశ్యకత ప్రతిఒక్కరికి అర్థమైంది. మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని రంగ్వసా గ్రామానికి చెందిన రాజేంద్ర పాటిదార్(68).. ప్రాణవాయువును ప్రకృతి నుంచి ఎలా పొందాలో వివరిస్తున్నారు. అందుకోసం 68ఏళ్ల సాహసం చేసి రావి చెట్టు ఎక్కుతున్నారు.
రోజూ రావి చెట్టుపైనే
రావిచెట్టు ఎక్కేందుకు సిద్ధమైన రాజేంద్ర పాటిదార్ రాజేంద్ర ఇంటివద్ద రెండు రావిచెట్లు ఉన్నాయి. రోజూ ఉదయం రావిచెట్టు ఎక్కి కుర్చీ వేసుకుని సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటారు. రాజేంద్ర మనవడు సైతం తాత బాటలోనే రావిచెట్టుపై కూర్చుంటాడు. రావిచెట్టు 24 గంటలు తాజా, నాణ్యమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని రాజేంద్ర చెబుతున్నారు.
చెట్టుఎక్కేందుకు కుర్చీతో వెళ్తూ.. ప్రజలకు వివరించేందుకే..
ఇందోర్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో తనకు తెలిసిన ఈ పద్ధతిని ప్రజలకు చెప్పాలని రాజేంద్ర నిర్ణయించుకున్నారు. 20 రోజుల నుంచి ఇలా చేస్తున్నానని, తన ఆక్సిజన్ స్థాయి 99గా ఉందని చెప్పుకొచ్చారు రాజేంద్ర. చెట్టుపైనే యోగాసనాలు కూడా చేస్తానన్నారు.
రోజూ చెట్టు ఎక్కటం వల్ల వ్యాయామం కూడా చేసినట్లు అవుతుందని వివరిస్తున్నారు. రాజేంద్ర పాటిదార్‌ను ఆదర్శంగా తీసుకుని గ్రామంలో చాలా మంది రావిచెట్టుపై కూర్చునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదీ చదవండి :ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు!