ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ ఉంటారు. ఇప్పుడు ఆ మాటను నిజం చేసిందో జంట. 67 ఏళ్ల వృద్ధురాలు 28 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజ జీవనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లా కైలారస్లో వెలుగు చూసింది.
ఆమెకు 67.. అతడి వయసు 28.. నోటరీ చేయించిమరీ సహజీవనం! - 28 ఏళ్ల యువకుడిని ప్రేమించిన వృద్ధురాలు
జిల్లా కోర్టుకు నోటరీ కోసం వచ్చిన ఓ జంటను చూసి షాక్ అయ్యారు అక్కడివారు. తాము సహజీనం చేస్తున్నామంటూ నోటరీ చేయించుకుంది ఆ జంట. ఇందులో వింత ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ జంటలో అబ్బాయి వయసు 28 ఏళ్లు అయితే అతని భాగస్వామి వయసు 67 ఏళ్లు!
ఒకే ప్రాంతంలో నివసిస్తున్న 67 ఏళ్ల రామ్కాళి, 28 ఏళ్ల భోలు.. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వీరు.. సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరి బంధంపై ఎలాంటి వివాదం తలెత్తకుండా నోటరీ చేయించుకోవాలని భావించింది ఆ జంట. గ్వాలియర్ జిల్లా కోర్టుకు వెళ్లి.. తమ సహజీవనాన్ని గుర్తించేందుకు నోటరీ చేయించుకుంది. సహజీవనంలో ఉన్నవారు ఎలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు ఇలా నోటరీలు చేయించుకుంటారని.. కానీ ఇలాంటి పత్రాలు అధికారికంగా చెల్లవని స్థానిక న్యాయవాది ప్రదీప్ అవస్థీ వెల్లడించారు.
ఇదీ చూడండి :భార్యలను మార్చుకున్న స్నేహితులు.. చివరకు దిమ్మతిరిగే షాక్