తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid Cases in India: 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు - భారత్​లో కరోనా వ్యాప్తి

Covid Cases in India: దేశంలో కొత్తగా మరో 6,563 కరోనా కేసులు నమోదయ్యాయి. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వ్యాక్సిన్​ పంపిణీ కూడా విస్తృతంగా సాగుతోంది. ఆదివారం 15,82,079 మందికి టీకాలు అందించారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Dec 20, 2021, 10:06 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 6,563 కేసులు నమోదుకాగా వైరస్​ ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,077 మంది కోలుకున్నారు. 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 3,47,46,838‬

మొత్తం మరణాలు: 4,77,554

యాక్టివ్ కేసులు: 82,267

కోలుకున్నవారు: 3,41,87,017

Vaccination in India

దేశంలో టీకా పంపిణీ విస్తృతంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 15,82,079 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,37,67,20,359కు చేరింది.

Covid world cases

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 4,74,101 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3870 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 66 వేల కేసులు వెలుగుచూశాయి. వైరస్​ ప్రభావానికి 109 మంది ప్రాణాలు కోల్పోగా.. 24,730 మంది కోలుకున్నారు.
  • బ్రిటన్​లో వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 82 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 45 మంది మరణించారు. 13 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • ఫ్రాన్స్​లో 48 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 75 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 86 లక్షల 77 వేలకు చేరుకుంది.
  • రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కొత్తగా 27 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 1,023 మంది కొవిడ్​తో మృతిచెందారు.

ఇదీ చూడండి :టీకా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి.. ఒమిక్రాన్ పాజిటివ్!

ABOUT THE AUTHOR

...view details