మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులో భాగంగా ఉగాండాకు చెందిన ఓ మహిళను ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారులు. ఆమె కడుపులో 535 గ్రాముల 49 హెరాయిన్ క్యాప్సుల్స్, 174 గ్రాముల 15 కొకైన్ క్యాప్సుల్స్‌ను గుర్తించి.. బయటకు తీశారు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్లకుపైనే ఉంటుందని తెలిపారు.
ఉగాండా నుంచి వస్తున్న మహిళ అనుమానాస్పదంగా ఉందన్న పక్కా సమాచారంతో మే 28న ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు అధికారులు. ముంబయి విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. క్యాప్సుల్స్ రూపంలో డ్రగ్స్‌ను శరీరంలో దాచి తీసుకురావచ్చనే అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దాంతో 11 క్యాప్సుల్స్‌లో మింగినట్లు అంగీకరించింది. 110 గ్రాముల 10 హెరాయిన్ క్యాప్సుల్స్‌ను వెలికితీశారు. అనంతరం మిగిలిన వాటిని తీసేందుకు మహిళను బెకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించారు.