ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ మహిళ పేరు శీలా దేవి. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా ఆడుకోవాల్సిన సమయంలో జీవనోపాధి కోసం పాటు పడుతోంది. 62 ఏళ్ల వయసులోనూ సైకిల్‌పై ప్రయాణిస్తు పాలు విక్రయిస్తోంది. 22 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్న ఆమె.. 'వయసు' కేవలం అంకె అని రుజువుచేసింది.
పెళ్లయిన ఏడాదికే భర్త మరణించినా.. శీలా కుంగిపోలేదు. తన పొలంలో వ్యవసాయం చేయడం ప్రారంభించింది. జీవితం అప్పుడే కుదుటపడుతున్న సమయంలో తన తల్లితండ్రులను కోల్పోయింది. అయినా ఎవరిపై ఆధార పడకుండా ముందుకు సాగింది. రెండు గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారం ప్రారంభించింది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు పలు మార్కెట్లకు సైతం పాలు విక్రయిస్తోంది.
"నేను ఎవరికీ భారంగా లేను. నా పని నేను చేసుకుంటాను. ఉదయం 4 గంటలకు నిద్ర లేస్తాను. ఇంట్లో పని చూసుకుని పశువులకు మేత వేస్తాను. తర్వాత పాలు పితుకుతాను. సేకరించిన పాలు అమ్మడానికి సైకిల్‌పైనే వెళ్తాను."
-శీలా దేవి, వృద్ధురాలు.
వృద్ధ వయసులోనూ మనోధైర్యంతో నిలబడి పాల వ్యాపారం చేస్తున్న శీలాదేవిని ఆమె గ్రామాస్థులు ప్రేమగా 'శీలా బువా' అని పిలుస్తుంటారు.