Triplets In MP : మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. 62 ఏళ్ల ఓ వృద్ధ భర్త, 30 ఏళ్ల భార్య ఇద్దరూ కలిసి మంగళవారం ఉదయం ఒకేసారి ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. కాగా, నవజాత శిశువుల ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉండటం వల్ల వైద్యులు వారిని ఆస్పత్రిలోని ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
Old man becomes father : జిల్లాలోని ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహా (62), హీరాబాయి కుష్వాహా (30) దంపతులు. సోమవారం రాత్రి గోవింద్ భార్య హీరాబాయికి పురిటి నొప్పులు రావడం వల్ల ఆమెను సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు మంగళవారం ఉదయం హీరాబాయికి ఆపరేషన్ చేశారు. ఈ కాన్పులో ఆమె ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, శిశివుల ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉండటం కారణంగా వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
"అతర్వేదియా గ్రామానికి చెందిన హీరాబాయి కుష్వాహాకు పురిటి నొప్పులు రావడం వల్ల సోమవారం జిల్లా ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం 6:10 గంటల సమయంలో హీరాబాయి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మామూలుగా సాధారణ ప్రసవం 35 వారాలకు పూర్తవుతుంది. కానీ, ఈమె ఎనిమిదన్నర నెలలకే ప్రసవించడం కారణంగా పిల్లలు బలహీనంగా పుట్టారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. శిశువులను ఐసీయూలో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము." అని జిల్లా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ అమర్ సింగ్ తెలిపారు.