Bihar Minor Rape: బిహార్ పశ్చిమ చంపారణ్ జిల్లాలో మైనర్పై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాత వరుస అయ్యే పొరుగింటి వ్యక్తి(60) బాలికపై చాలా రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు తెలియకుండా బాధితురాలి కుటుంబ సభ్యులతో పంచాయతీలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రామపెద్దలు వృద్ధుడికి రూ.2లక్షలు జరిమానా విధించి బాధితురాలి కుటుంబానికి అందజేశారు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో కేసు వాపస్ తీసుకున్నారు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది.
'తాత' అత్యాచారం.. బాలికకు గర్భం.. రూ.2లక్షల పరిహారంతో రాజీ! - బిహార్లో మైనర్పై అత్యాచారం
Bihar Rape Case: మైనర్పై చాలా రోజుల పాటు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన వృద్ధుడికి రూ.2లక్షల జరిమానాతో సరిపెట్టింది ఓ గ్రామపంచాయతీ. ఈమేరకు బాధితురాలి కుటుంబానికి, వృద్ధుడికి మధ్య ఒప్పందం కుదుర్చింది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గర్భందాల్చిన బాలిక: బాధితురాలు వృద్ధుడి పొరుగింట్లో ఉంటోంది. ఒంటరిగా ఉండే అతనికి వంట చేసేందుకు పంపాలని బాలిక తండ్రిని అడిగాడు వృద్ధుడు. అందుకు అతను ఒప్పుకుని కూతుర్ని రోజూ వంట చేసేందుకు పంపాడు. అయితే వృద్ధుడు చిన్నారితో వంట కాకుండా రోజూ మసాజ్ చేయించుకునేవాడు. ఆ క్రమంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. రోజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు రానీయకుండా చూసుకున్నాడు. అయితే బాలిక గర్భం దాల్చింది. దీంతో షాక్ తిన్న కుటుంబసభ్యులు ఆమెకు గుట్టుగా అబార్షన్ చేయించారు. వృద్ధుడి పలుకుబడికి భయపడి విషయం ఎవరకీ చెప్పలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత వృద్ధుడు మళ్లీ బాలికతో సంబంధం ఏర్పరుచుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామం మొత్తం తెలిసింది. దీంతో గ్రామపెద్దలు పంచాయతీ ఏర్పాటు చేశారు. బాధితురాలి కుటుంబానికి వృద్ధుడు రూ.2 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిర్చారు. అనంతరం బాలిక కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు వాపస్ తీసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత విషయం పై అధికారులకు తెలిసింది. దీంతో జిల్లా ఎస్పీ.. ఎస్హెచ్ఓను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం.. ఆపై ఇనుప రాడ్తో