తౌక్టే తుపాను ధాటికి ఐదు రోజుల క్రితం అరేబియా సముద్రంలో 'బార్జ్ పీ305' నౌక మునిగిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న నావికా, తీర రక్షణ దళాలు.. శుక్రవారం మరో 11 మృతదేహాలను కనుగొన్నాయి. ఇంకో 15 మంది జాడ తెలియాల్సి ఉంది.
'పీ305' దుర్ఘటనలో 60కి పెరిగిన మృతులు - పీ305 దుర్ఘటన తాజా వార్తలు
తౌక్టే తుపాను కారణంగా అరేబియా సముద్రంలో ఐదు రోజుల క్రితం గల్లంతైన భారీ నౌక పీ-305లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 60కి చేరింది. గల్లంతైన మరో 15 మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు అధికారులు.

బార్జ్ పీ305, నౌక ప్రమాదం
261 మందితో ప్రయాణిస్తున్న 'బార్జ్ పీ305' నౌక గత సోమవారం నీట మునిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 186 మందిని రక్షించారు అధికారులు.
ఇదీ చదవండి:సొరంగం కూలి నలుగురు మృతి