తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పసివాడి ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు! - క్రికెట్​ ఆడుతుండగా బాలుడిపై పడ్డ చెట్టు

కర్ణాటక మైసూరులో విషాదం జరిగింది. ఇంటి ఆరుబయట ఆడుకుంటుండగా.. ఓ ఆరేళ్ల బాలుడిపై కొబ్బరి చెట్టు పడింది. దాంతో ఆ పసివాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

boy died cocount tree falls
కొబ్బరి చెట్టు పడి బాలుడి మృతి

By

Published : Jun 14, 2021, 8:35 AM IST

Updated : Jun 14, 2021, 11:57 AM IST

కొబ్బరి చెట్టు కూలి ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. ఆరు బయట ఆడుకుంటున్న తమ కుమారుడు విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

అసలేం జరిగింది?

మైసూరు జిల్లా కుప్పరవల్లి గ్రామానికి చెందిన అభయ్​(6) అనే బాలుడు తమ ఇంటి ముందు మరో చిన్నారితో కలిసి క్రికెట్​ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా అక్కడే ఉన్న కొబ్బరి చెట్టు.. బాలుడిపై కుప్పకూలింది. దాంతో అభయ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలికకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

మృతి చెందిన అభయ్​
కూలిన కొబ్బరి చెట్టు
అభయ్​ మృతితో రోదిస్తున్న స్థానికులు

అభయ్​ మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ ఘటనపై బిలిగేరే పోలీస్​ స్టేషన్లో​ కేసు నమోదైంది.

ఇదీ చూడండి:కాటేసిన పామును పట్టుకుని ఆసుపత్రికి..

ఇదీ చూడండి:బాంబు తయారు చేసి.. నేరుగా పోలీస్​ స్టేషన్​కే వెళ్లి...

Last Updated : Jun 14, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details