అభంశుభం తెలియని ఆ పసిపిల్లలపై తండ్రి, సవతి తల్లి కలిసి కిరాతకంగా దాడి చేశారు. లాడ్జిలోని ఓ గదిలో వారిని బంధించి చిత్ర హింసలు పెట్టారు. ఎట్టకేలకు ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఆ పిల్లలకు విముక్తి కలిగింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లా మంబాద్ పట్టణంలో జరిగింది.
చిన్నారులపై తల్లిదండ్రుల క్రూరత్వం అసలు ఏం జరిగింది?
తమిళనాడుకు చెందిన నిందితుడు తనకరాజ్కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పద్మప్రియకు పదేళ్లు కాగా కుమారుడు దువసేన్కు ఐదేళ్లు. నిందితురాలు మైయమ్ముతో కలిసి వీరిని కొన్ని నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. చిన్నారుల ఒంటినిండా కాలిన గుర్తులు సహా కుమార్తె పద్మప్రియ కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
చికిత్స పొందుతున్న చిన్నారులు తీవ్రంగా గాయపడిన చిన్నారి పద్మప్రియ చిన్నారులను మంబాద్ ఓ ప్రైవేట్ లాడ్జిలో బంధించారు. బుధవారం ఉదయం సుమారు 10.30 గంటలకు పక్క గదిలో ఉన్న ఓ మహిళ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అధికారులు పిల్లలను వారి చెర నుంచి విడిపించారు. పిల్లల బాధ్యతను అధికారులు బాలల పరిరక్షణ కమిటీకు అప్పగించారు. ప్రస్తుతం చిన్నారులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిలాంబూర్ ఠాణాకు తరలించారు.
ఇదీ చదవండి :బంగాల్ దంగల్: నడ్డా, దీదీ మాటల యుద్ధం