గుజరాత్ అహ్మదాబాద్‌లో రెండో తరగతి చదువుతున్న అర్హమ్ ఓం తల్సానియా.. అరుదైన ఘనత సాధించాడు. ఆరేళ్లకే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పట్టు పెంచుకుని చిన్న చిన్న వీడియో గేమ్స్ సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో పైథాన్ కోడ్‌ను బ్రేక్ చేసి.. అతిచిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.
పియర్సన్ వీయూఈ టెస్ట్ సెంటర్ నిర్వహించిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ పరీక్షను పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు తల్సానియా. తన తండ్రి ప్రోత్సాహంతో కోడింగ్ నేర్చుకున్నానని చెబుతున్నాడు.
"మా నాన్న నాకు కోడింగ్ నేర్పారు. రెండేళ్ల వయసులోనే ట్యాబ్లెట్ ఉపయోగించటం మొదలుపెట్టా. మూడో ఏటనే ఐఓఎస్, విండోస్ పరికరాలు కొనుగోలు చేశా. ఆ తర్వాతనే మా నాన్న పైథాన్‌పై పనిచేస్తున్నారని తెలిసింది.
నేను చిన్న గేమ్స్ రూపొందిస్తున్న సమయంలో పైథాన్ సర్టిఫికేట్ వచ్చింది. ఆ తర్వాత నా పని గురించి కొన్ని ఆధారాలు కావాలని అడిగారు. వాళ్లు నన్ను ధ్రువీకరించిన తర్వాత గిన్నిస్ రికార్డు వచ్చింది."