తెలంగాణ

telangana

ఆరేళ్ల 'రూబిక్స్'​ క్వీన్​.. గిన్నిస్ బుక్​లో చోటు.. 8 అంతర్జాతీయ​ రికార్డులు​ సొంతం!

By

Published : Jul 4, 2023, 10:51 PM IST

Rubiks Cube Girl Video : కష్టమైన రూబిక్స్​ క్యూబ్​ను క్షణాల్లో పరిష్కరిస్తూ గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది ఓ చిన్నారి. ఆరేళ్ల వయసులో పెద్దలతో పోటీపడుతూ వారిని ఓడిస్తోందీ చిచ్చర పిడుగు. స్కేటింగ్​ చేస్తూ రూబిక్స్ క్యూబ్​ పరిష్కరించి 8 అంతర్జాతీయ రికార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ వండర్​ కిడ్​ ఎవరంటే?

Rubiks Cube Girl Video
Rubiks Cube Girl Video

రూబిక్స్​ క్యూబ్​ పరిష్కరించిన ఆరేళ్ల చిన్నారి.. గిన్నిస్ రికార్డుతో సహా 8 అంతర్జాతీయ​ రికార్డ్స్​

Rubiks Cube Girl Video : రంగురంగుల రూబిక్స్‌ క్యూబ్‌ను పరిష్కరించడం అంత సులభం కాదు. కొంతమందికి ఒక కలర్‌ను పూర్తి చేయడానికే గంటల సమయం పడుతుంది. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్​కు చెందిన ఆరేళ్ల చిన్నారి కనికా భగ్తీయా మాత్రం క్షణాల్లో రూబిక్స్‌ క్యూబ్‌ను పరిష్కరిస్తోంది. అలా 3×3 మల్టీ క్యూబ్‌ను​ పరిష్కరించిన అతి పిన్న వయస్కురాలిగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. అంతే కాకుండా కళ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్‌ చేస్తూ క్యూబ్‌ను పరిష్కరిస్తోంది కనికా.

కనికకు నాలుగున్నర ఏళ్లు ఉన్నప్పుడు కొవిడ్​ సమయంలో ఓ పుట్టిన రోజు వేడుకకు తండ్రితో కలిసి వెళ్లింది. ఆ వేడుకలో రిటర్న్ గిఫ్ట్​గా రూబిక్స్ క్యూబ్​ను పొందింది. తర్వాత దాన్ని సింగిల్​ కలర్​కు మార్చి.. పూర్తిగా ఎలా పరిష్కరించాలో తండ్రి కేయూర్​ భగ్తీయాను అడిగింది. దీంతో అతడు తన ఇంటి సమీపంలోని ఓ అకాడమీలో చేర్పించారు. కేవలం రెండు నెలల్లోనే రూబిక్స్ క్యూబ్‌ను ఎలా పరిష్కరించాలో నేర్చుకుంది. ప్రస్తుతం, ఆమె అతి కష్టమైన ఎనిమిది రకాల రూబిక్స్ క్యూబ్‌లను విజయవంతంగా పరిష్కరించగలదు. అలా 3x3 మల్టీ క్యూబ్‌ను పరిష్కరించిన అతి పిన్న వయస్కురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. బ్యాడ్మింటన్​ స్టార్ సైనా నెహ్వాల్​ ప్రేరణతో ముందుకు సాగుతోంది ఈ చిన్నారి.

కనికా భగ్తీయా

"ఓసారి మా నాన్న సైనా నెహ్వాల్​ సినిమా చూస్తున్నారు. అప్పుడు.. ఏం చూస్తున్నారు నాన్న అని అడిగాను. ఆమె బ్యాడ్మింటన్​ ఆడుతోందని చెప్పారు. ఆ తర్వాత మెడల్స్ అంటే ఏమిటి? అని నాన్నను అడిగాను. మెడల్స్​ అంటే కొనుగోలు చేసేవి కావని.. వాటి కోసం ప్రాక్టీస్​ చేయాలని.. ఓటమిని అంగీకరించవద్దని నాన్న నాకు చెప్పారు"
--కనికా భగ్తీయా

రూబిక్స్​ క్యూబ్​తో పాటు స్కేటింగ్​లో కూడా దిట్ట ఈ వండర్​ కిడ్​. స్కేటింగ్​ చేస్తూ అత్యధిక వివిధ రకాల రూబిక్స్ క్యూబ్​లను పరిష్కరించిన చిన్నారిగా వరల్డ్​ రికార్డు సాధించింది. దీంతో పాటు మరో ఏడు అంతర్జాతీయ రికార్డులను కూడా సొంతం చేసుకుంది కనిక. తన దగ్గర దాదాపు రెండు సంవత్సరాల నుంచి కనిక స్కేటింగ్​ నేర్చుకుంటోందని ఆమె కోచ్​ పార్వ్​ పాండ్య చెప్పారు. 'కనిక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని, మంచి ర్యాంకులతో గెలుపొందింది. గోవా, ఆగ్రా, సూరత్, బరోడా మొదలైన జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొంది. స్కేటింగ్‌లో గొప్ప రికార్డులు సృష్టించింది' అని పాండ్య తెలిపారు. కనిక వయసు ఆరేళ్లే అయినా.. పెద్దవారు, అనుభవజ్ఞులైన వారితో పోటీపడుతూ వారిపై గెలుస్తోంది.

కనికా భగ్తీయా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details