తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల బాలుడి బైక్ రేస్... తండ్రిపై పోలీసుల కేసు!

boy mud race: ఆరేళ్ల బాలుడు డర్ట్ బైక్ రేస్ పాల్గొన్నాడు. ఈ ప్రమాదకర రేస్​లో చిన్నారి పాల్గొన్నందుకు అతడి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, తన కుమారుడు శిక్షణ కోసమే బైక్​పై ప్రయాణించాడని తండ్రి షానవాజ్ చెప్పుకొచ్చారు.

mud raising training
mud raising training

By

Published : Apr 12, 2022, 12:20 PM IST

boy mud race: మట్టిలో దూసుకుపోయే బైక్​ల ఆట చూసే ఉంటారు. ఎత్తుపల్లాలుగా ఉండే మట్టిరోడ్లపై ప్రయాణిస్తూ.. బైక్​తో విన్యాసాలు చేస్తూ ఈ గేమ్ సాగిపోతుంటుంది. కొంచెం అటూఇటుగా నడిపితే అంతే సంగతులు! అలాంటి డర్ట్ గేమ్ పోటీల్లో ఓ ఆరేళ్ల బాలుడు రేసింగ్ చేస్తూ అధికారుల కంట పడ్డాడు. సీనియర్లతో కలిసి బైక్ రేసింగ్ చేశాడు. శిక్షణలో భాగంగానే ఇలా చేసినప్పటికీ.. అధికారులు చర్యలు తీసుకున్నారు.

బైక్​పై బాలుడు.. పక్కనే తండ్రితో కలిసి ఫొటో

Six year boy mud race training:పాలక్కడ్​కు చెందిన షానవాజ్ అబ్దుల్లా కుమారుడు డర్ట్ బైక్​పై విన్యాసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. షానవాజ్​కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దక్షిణ పాలక్కడ్ పోలీస్ స్టేషన్​కు రావాలని సమాచారం పంపారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బైక్ రేసింగ్ కోసం శిక్షణ ఇస్తున్న నిర్వహకుల వివరాలు సేకరిస్తున్నారు.

ఆదివారం ఈ శిక్షణ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని కాడగొట్ట సమీపంలో రేసింగ్​కు శిక్షణ ఇచ్చారు. అయితే, తన కుమారుడు శిక్షణ కోసమే బైక్​పై ప్రయాణించాడని షానవాజ్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం బొమ్మ బైక్​నే ఉపయోగించాడని తెలిపారు. ఎలాంటి నిబంధనను తాము అతిక్రమించలేదని చెప్పారు.

ఇదీ చదవండి:మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. తీవ్రంగా హింసించి గ్యాంగ్​రేప్

ABOUT THE AUTHOR

...view details