తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిమింగలాల వాంతితో దందా- ముఠా అరెస్ట్​ - tamilnadu crime news

తమిళనాడులో భారీ మొత్తంలో యాంబర్​గ్రీస్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఆరెస్టు చేశారు. దాని విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు.

Ambergris
యాంబర్​గ్రీస్ అక్రమ తరలింపు

By

Published : Jun 22, 2021, 3:49 PM IST

Updated : Jun 22, 2021, 4:39 PM IST

సుమారు రూ.2 కోట్ల విలువైన యాంబర్​గ్రీస్​ను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు, తుత్తుకుడి జిల్లాలోని తిరుచేందురు పట్టణంలో జరిగింది.

అక్రమ తరలింపుపై ముందే సమాచారం అందుకున్న పోలీసులు జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహన తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. తిరుచేందురు పట్టణంలో ఓ కారును తనిఖీ చేయగా .. రూ.2 కోట్ల విలువ చేసే యాంబర్​గ్రీస్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు.

యాంబర్​గ్రీస్ స్వాధీనంపై వివరిస్తున్న పోలీసులు

ఏంటి యాంబర్​ గ్రీస్​..?

యాంబర్​ గ్రీస్​ అనేది రాయిలా ఉండే ఓ ఘన పదార్థం. సముద్రంలో ఉండే తిమింగలాలు ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటాయి. ఆ సమయంలో ఆహారంగా రకరకాల చేపలు, సముద్ర జంతువులను తింటూ ఉంటాయి. అలా తిమింగలాలు తిన్న ఆహారం కొన్ని సార్లు జీర్ణం కాదు. అది కొన్ని ఏళ్ల పాటు కడుపులోనే ఉండి పోతుంది. ఎప్పుడైనా ఓ సారి దానిని తిమింగలాలు వాంతి చేసుకుంటాయి. ఇలా అది బయటకు వస్తుంది అని మెరైన్ బయోలాజికల్ స్టడీస్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ వివరించారు. దీన్ని అగ్నితో వేడి చేస్తే మొదట భరించలేని వాసన వస్తుందని తెలిపారు. ఆపై ఇది సువాసనలు వెదజల్లుతుందని పేర్కొన్నారు. దీనిని సుగంధాల తయారీ ఉపయోగిస్తారని చెప్పిన ఆయన.. ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.

ఇదీ చదవండి:కుమారుడికి అడ్మిషన్​ ఇవ్వలేదని బాంబు బెదిరింపు​!

భారీగా డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం

Last Updated : Jun 22, 2021, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details