అసోంలో ఆదివారం తెల్లవారు జామున భద్రతా సిబ్బంది, దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ నాగాలాండ్ సరిహద్దు వెంబడి పశ్చిమ కార్బీ ఆంగ్ లాంగ్ జిల్లాలో జరిగిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఉగ్రమూకల ఉనికిపై సమాచారం మేరకు పశ్చిమ ఆంగ్ లాంగ్ అదనపు ఎస్పీ ప్రకాశ్ సోనోవాల్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.
అయితే అంతకుముందు పోలీసుల కాల్పుల్లో ఆరుగురే చనిపోయినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ అనంతరం జరిపిన కూంబింగ్ లో మరో ఇద్దరు అగ్రనేతల మృతదేహాలు లభించినట్లు ఆయన వెల్లడించారు.
దౌజీఫాంగ్ ప్రాంతంలో గతవారం ఓ పూజరి హత్య జరిగిన నాటి నుంచి జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.