కర్ణాటక(karnataka corona cases ) ధార్వాడ్ జిల్లాలోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలలో కరోనా కలకలం సృష్టించిన కొన్ని రోజులకే.. మరో మెడికల్ కాలేజీలో కొవిడ్ వ్యాపించింది. చామరాజ్నగర్ జిల్లాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు(సీఐఎంఎస్)(corona in medical college) చెందిన ఆరుగురు విద్యార్థులు సహా ఓ ఇంటర్నీకి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ సోకిన విద్యార్థులను జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
వైరస్ బాధితులంతా సీఐఎంఎస్లోని(Cims corona) వసతి గృహంలో ఉంటున్నారని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరయ్య తెలిపారు.
"సీఐఎంఎస్ వసతి గృహంలో ఉండే మొత్తం 325 మంది విద్యార్థులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో ఈ ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. మరో 150 మందికి సోమవారం పరీక్షలు నిర్వహించాం. వారి ఫలితాలు రావాల్సి ఉంది. బాధితులతో సన్నిహతంగా ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం."
-డాక్టర్ విశ్వేశ్వరయ్య, చమరాజ్నగర్ జిల్లా ఆరోగ్య అధికారి
మరోవైపు.. ధార్వాడ్‌లోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలలో కొవిడ్-19 బారిన పడిన విద్యార్థుల సంఖ్య 281కు చేరింది. వీరిలో మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారేనని వివరించారు. విద్యార్థులందరినీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.