తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.16కోట్ల ఇంజెక్షన్​ అందక చిన్నారి మృతి - smn1 gene mutation inheritance

నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 6 నెలల చిన్నారికి వైద్యం చేయాలంటే రూ.16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్​ అవసరం. కానీ ఆ పాప తల్లిదండ్రులకు అంత స్తోమత లేదు. ఫలితంగా ఆ చిన్నారి చనిపోయింది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్​లో జరిగింది.

6-month-old child
6నెలల చిన్నారి మృతి

By

Published : Jun 15, 2021, 5:22 PM IST

వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఆ పాపకు వచ్చింది. నయం చేయడానికి ఒక ఇంజెక్షన్​ అవసరం. కానీ అది భారత్​లో దొరకదు. విదేశాల నుంచి తెప్పించాలంటే రూ.16 కోట్లు ఖర్చవుతుంది. అంతటి స్తోమత ఆ పాప తల్లిదండ్రులకు లేదు. దాంతో ఆ ఇంజెక్షన్​ అందక ఆ చిన్నారి మరణించింది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్​ బీకనీర్​ జిల్లాలో జరిగింది.

6 నెలల పాప నూర్​ ఫాతిమాకు స్పైనల్​ మస్కులర్​ అట్రోపీ(ఎస్​ఎమ్​ఏ) అనే నాడీ సంబంధిత వ్యాధి ఉంది. ఎస్​ఎమ్​ఏ అనే జన్యువు లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మాటను, నడకను, ఆహారాన్ని మింగటాన్ని నియంత్రించే మెదడు కణాలను ఈ వ్యాధి క్రమక్రమంగా నశింపజేస్తుంది. కండరాలను బలహీన పరిచి పాలు తాగేందుకు, ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడేలా చేస్తుంది. ఎదిగే క్రమంలో కనీసం సరిగ్గా కూర్చోలేరు కూడా.

ఇదీ చదవండి:ఈ చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజక్షన్​కు రూ.16కోట్లు కావాలి!

ఈ వ్యాధిని నయం చేయాలంటే జోల్​జెన్​స్మా ఇంజెక్షన్​ ఇవ్వాలి. అమెరికా నుంచి ఆ ఔషధాన్ని తెప్పించే స్తోమత పాప తల్లిదండ్రులకు లేదు. కొంతమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు విరాళం ఇచ్చాయి. కానీ అవి సరిపోలేదు. పాప అంకుల్​ ఇనాయత్​ అలీ, తమకు సాయం చేయాల్సిందిగా ఈటీవీ భారత్​ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు. అంతలోనే ఆ పసిబిడ్డ ప్రాణాలు విడిచింది.

ఇదీ చదవండి:చిన్నారి చికిత్సకు ప్రధాని రూ.6 కోట్ల సాయం!

పదివేల మంది పిల్లల్లో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. భారత్​లో ఈ వ్యాధి బారినపడిన చిన్నారులు 800 వరకు ఉంటారు.

ఇదీ చదవండి:పసివాడి ప్రాణానికి రూ.16 కోట్ల ఇంజక్షన్

ABOUT THE AUTHOR

...view details