ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లూథియానా నుంచి రాయ్‌బరేలీకి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం ఫిరోజాబాద్‌లో జరిగింది. మృతుల్లో 14 నెలల చిన్నారి, ఒక మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయిన బస్సు.. 14 నెలల చిన్నారితో సహా ఆరుగురు మృతి - Agra Lucknow Expressway bus accident
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 14నెలల చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన మరో ఘటనలో ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయిన బస్సు
ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కరకంబాలోని దేశ్‌ముఖ్ వస్తీ సమీపంలో ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Last Updated : Dec 14, 2022, 12:54 PM IST