ఒడిశాలోని కలహండి జిల్లా కర్లాపాత్ అభయారణ్యంలో ఏనుగుల అనుమానాస్పద మృతి జంతు ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత 14 రోజుల్లో 6 గజరాజులు మృతిచెందాయి. ఇందులో 5 ఆడ ఏనుగులు, ఓ గున్న ఏనుగు ఉన్నాయి. మరణానికి కారణం పశువుల్లో వ్యాపించే హేమోర్హేజ్ సెప్టీస్కేమియా అనే వ్యాధి అని అధికారులు భావిస్తున్నారు. ఓ ఏనుగుకు జరిపిన పోస్ట్మార్టం రిపోర్ట్ మృతికి కారణం ఈ వ్యాధే అని సూచిస్తోందని పేర్కొన్నారు. పశువుల్లో వ్యాపించే ఈ వ్యాధి ఏనుగులకు సోకడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించలేదని, ఇటీవల వ్యాక్సినేషన్ కూడా జరిపామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పశువులకు మరోసారి వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు.
ప్రజల అనుమానాలు?