భారీ వర్షాలకు(Rains in lucknow) ఉత్తర, తూర్పు భారత్‌లోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరదలతో(Floods in India) లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్తు లేక వేలాది పల్లెలు అంధకారంలోకి వెళ్లాయి. లంక గ్రామాలు, కొండ ప్రాంతాల్లోని పల్లెల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
యూపీలో ఆరుగురు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు (Rains in lucknow) బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజధాని లఖ్‌నవూ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గంటలుగా ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాతాలన్నీ జలమయం అయ్యాయి. అనేక చోట్ల రహదారులపైకి నీరు చేరడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న గంటల్లో భారీ వర్షాలున్నాయన్న అధికారులు.. ఆ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జౌన్‌పుర్, కౌషాంబి, బారాబంకీ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీటిలో చాలా ఘటనలు బాధితులు నిద్రిస్తున్న సమయంలో జరిగాయని పోలీసులు తెలిపారు. వర్షాల కారణంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.
లఖ్‌నవూలోని ఓ రహదారిలో నిలిచిన వరద నీరు ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో ఇంట్లోకి వచ్చిన వరద నీరు ఒడిశాలో తొమ్మిందిమంది..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు(heavy rains in Odisha) కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. కేంద్రపార జిల్లాలోని ఓ గ్రామంలో వర్షాలకు గోడ కూలిపోయిన ముగ్గురు, జాజ్పుర్లో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఖొర్దా, గంజాం, కియోంజర్, సుబర్నాపుర్లలో ఒకరు చొప్పున గోడ కూలిన ప్రమాదంలో మృతి చెందారు. గంజాం జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు చెప్పారు.
ఒడిశాలో రోడ్లపై ప్రవహిస్తున్న వాగులు ఒడిశాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది ఐదు ఒడిశా విపత్తు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రెండు జాతీయ విపత్తు స్పందన దళాలను బాలాసోర్, భద్రాక్, కేంద్రపారా జిల్లాలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 23,82,795 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 4,964 గ్రామాలు, 33 పట్టణాలు ప్రభావితమైనట్లు చెప్పారు.
దిల్లీలో రికార్డ్...
దిల్లీలో వర్షాలు(Rainfall in Delhi) దంచికొడుతున్నాయి. గురువారం నాటికే ఈ ఏడాది వర్షకాల సీజన్లో 1159.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. 1964 తర్వాత ఇదే అత్యధికం. దిల్లీ చరిత్రలో మూడో రికార్డ్. అలాగే.. సెప్టెంబర్ నెల రికార్డ్ సైతం బద్దలైంది. గతంలో ఒక్క నెలలో అత్యధిక వర్షపాతం 400 ఎంఎం ఉండగా.. ఈ ఏడాది 403 ఎంఎంగా నమోదైంది. 1944, సెప్టెంబర్‌లో నమోదైన 417.3 ఎంఎం రికార్డు తర్వాత ఇదే అత్యధికం కావటం గమనార్హం. మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా వర్షాకాలంలో 653.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. గత ఏడాది 648.9 ఎంఎంగా నమోదైంది. 1933లో నమోదైన 1420.3మిల్లీమీటర్లు ఇప్పటి వరకు ఆల్‌టైమ్ రికార్డ్‌గా ఉంది. ఆ తర్వాత 1964లో 1190.9, 1975లో 1155.6 ఎంఎం వర్షపాతం నమోదైంది.
దిల్లీలో జలమయమైన రహదారులు దిల్లీలో ముంచెత్తిన వరదలు ఇదీ చూడండి:రికార్డు స్థాయిలో వర్షపాతం.. జలదిగ్బంధంలో పట్టణాలు