తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి - ఇండోర్​ రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న ట్యాంకర్​ను ఢీకొనడం వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

indore, accident
ఇండోర్​ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

By

Published : Feb 23, 2021, 8:56 AM IST

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ శివార్లలో.. ఆగి ఉన్న ట్యాంకర్​ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ జరిగింది..

ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న దాబా నుంచి యువకులు కారులో ఇండోర్​కు తిరిగివస్తున్న క్రమంలో ఓ పెట్రోల్​ బంక్​​ దగ్గర ఆగి ఉన్న ట్యాంకర్​ను అతివేగంతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల సాయంలో అధికారులు అతికష్టం మీద వారి మృతదేహాలను వెలికితీశారు.

ఇండోర్​ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

మృతులను రిషి, సూరజ్​ బైరాగి, చంద్రభాణ్​ రఘవంశీ అలియాస్​ ఛోటు, సోనూ జాట్​, సుమిత్​లగా గుర్తించారు.

ఇదీ చదవండి :బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 8మంది మృతి

ABOUT THE AUTHOR

...view details