ఆదివారం (మార్చి 21) ఉదయం నాటికి దేశంలో 4.5 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మరో 6 కోట్ల టీకా డోసులను 76 దేశాలకు పంపించినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజా ఉద్యమంగా మలచాలని పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని సీఎస్ఐఆర్- ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (ఐఎమ్టెక్)వద్ద ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'భారత్‌లో 4.5 కోట్లు, విదేశాలకు 6 కోట్ల టీకాలు ' - vaccination drive
దేశవ్యాప్తంగా 4.5 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మరో 6 కోట్ల డోసులను విదేశాలకు పంపించినట్లు తెలిపారు.
'భారత్‌లో 4.5 కోట్లు, విదేశాలకు 6 కోట్ల కరోనా టీకాలు'
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అటల్ ఇన్క్యూబేషన్ సెంటర్‌కు విస్తరణగా ఐఎమ్టెక్ బయో-ఇన్నోవేషన్ సెంటర్‌ను హర్షవర్ధన్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా తక్కువ సమయంలోనే లైఫ్ సైన్సెస్‌లో వ్యవస్థాపకత, బయోటెక్నాలజీ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకానికి ఇది కేంద్రంగా ఉండనుంది.