తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా నేత వేశ్యాగృహంపై పోలీసుల దాడి.. 73 మంది అరెస్ట్ - bjp leader farm house biorthel

Police Attack On BJP Leader Farmhouse: మేఘాలయ భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్. మారక్​ తన ఫాంహౌస్​లో నిర్వహిస్తున్న వేశ్యాగృహంపై పోలీసులు దాడులు జరిపి.. ఆరుగురు మైనర్లకు విముక్తి కల్పించారు. దాంతో పాటు 73 మందిని అరెస్టు చేశారు.

బెర్నార్డ్ ఎన్. మారక్​
బెర్నార్డ్ ఎన్. మారక్​

By

Published : Jul 24, 2022, 4:55 AM IST

Updated : Jul 24, 2022, 6:35 AM IST

Police Attack On BJP Leader Farmhouse: మేఘాలయలోని తురా పట్టణంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్. మారక్​ తన ఫాంహౌస్​లో నిర్వహిస్తున్న వేశ్యాగృహంపై శనివారం పోలీసులు దాడులు చేశారు. ఆరుగురు మైనర్లకు విముక్తి కల్పించి 73 మందిని అరెస్టు చేసినట్లు చెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్సీ విదేశా నంద్ సింగ్ తెలిపారు. రాజకీయవేత్తగా మారిన మాజీ మిలిటెంటు మారక్ పాంహౌస్ పై పక్కా ఆధారంగా దాడి జరిపినట్లు వెల్లడించారు.

బెర్నార్డ్ ఎన్. మారక్​

తాము రక్షించిన ఆరుగురు మైనర్లలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలిపారు. వీరిని అపరిశుభ్రంగా ఉన్న చిన్నగ దుల్లో తాళం వేసి బంధించి ఉంచారన్నారు. 30 వరకు చిన్న గదులున్న ఆ ఫాంహౌస్​లో మారక్ సహచరులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి 73 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సీ వివరించారు. ఈ దాడిలో 27 పెద్ద వాహనాలు, 8 ద్విచక్ర వాహనాలు, 100 బాటిళ్లకు పైగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Last Updated : Jul 24, 2022, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details