తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిలుక కోసం పాముతో ఐదేళ్ల బుడతడి పోరాటం - చిలుక కోసం పాముపతో పోట్లాడిన ఐదేళ్ల బాలుడు

తనకు ఎంతో ఇష్టమైన చిలుకను కాపాడుకునేందుకు ఓ ఐదేళ్ల బుడతడు ఏకంగా పాముతోనే పోట్లాడాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.

five tears boy saves parrot from snake attack
ఇష్టమైన చిలుకకోసం పాముతో బుడతడి సాహసం

By

Published : Dec 28, 2020, 5:18 PM IST

చిన్న పిల్లలు తమకు నచ్చినదాని కోసం తల్లిదండ్రులపై అలగటం సాధారణంగా చూస్తుంటాం. అయితే కర్ణాటకకు చెందిన ఓ ఐదేళ్ల బాలుడు తనకు ఎంతో ఇష్టమైన చిలుక కోసం ఏకంగా పాముతోనే పోట్లాడాడు.

అసలేం జరిగిందంటే..

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఫామ్​హౌస్​లో ఓ కుటుంబం నివాసముంటోంది. మూడు రోజుల క్రితం ఎప్పటిలానే కుటుంబ సభ్యులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే ఇంట్లో ఉంటున్న 5 ఏళ్ల బుడతడు కార్తిక్ ఇంటి దగ్గరే ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో తమ కుటుంబం ఇష్టంగా పెంచుకుంటున్న చిలుక పంజరంలోకి ఓ పాము ప్రవేశించడం గమనించాడు కార్తిక్. ఆ పాము చిలుకను గాయపరుస్తుందన్న భయంతో కేకలు వేసినా ఎవరూ స్పందించలేదు. దీనితో తనకు ఎంతో ఇష్టమైన చిలుకను కాపాడుకునేందుకు ఏ మాత్రం భయం లేకుండా పామును చేతితో పట్టి లాగేశాడు ఆ బుడతడు. ఎట్టకేలకు స్వల్ప గాయాలతో చిలుకను రక్షించుకోగలిగాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలైన ఆ సర్పం మాత్రం ప్రాణాలు కోల్పోయింది.

పాముతో బుడతడు, గాయపడిన చిలుకతో కార్తిక్ సోదరి

ఇదీ చూడండి:11 ఏళ్ల బాలుడ్ని బలిగొన్న మూఢనమ్మకం!

ABOUT THE AUTHOR

...view details