తెలంగాణ

telangana

ETV Bharat / bharat

COVID: 'రెండో దశలో 594 మంది వైద్యులు మృతి'

రెండో దశ కరోనా విలయం కారణంగా దేశవ్యాప్తంగా 594 మంది డాక్టర్లు మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వెల్లడించింది. అత్యధికంగా దిల్లీలో 107 మరణాలు నమోదైనట్లు తెలిపింది.

594 doctors have died due to COVID-19 in second wave: IMA
కరోనా విలయంతో 594 వైద్యులు మృతి

By

Published : Jun 2, 2021, 8:11 PM IST

కరోనా రెండో దశ​ విజృంభణతో దేశవ్యాప్తంగా 594 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం దిల్లీలోనే 107 మంది మరణించారు. అలాగే.. బిహార్​లో 96, ఉత్తర్​ప్రదేశ్ 67, రాజస్థాన్ 43, ఉత్తరాఖండ్ 39, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 32 మంది చొప్పున వైద్యులు మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) పేర్కొంది.

"మొదటి దశలో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు మహమ్మారితో మరణించారు. అయితే ఈసారి తక్కువ వ్యవధిలోనే 594 మందిని కోల్పోయాం."

-జేఏ.జయలాల్, ఐఎంఏ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details