దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో.. సగానికిపైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 57,074 మందికి వైరస్ సోకింది. 222 మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30లక్షలు దాటింది.
నగరాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ముంబయిలో కొత్తగా 11,163 మందికి పాజిటివ్‌గా తేలింది. 25 మంది మృతిచెందారు. పుణెలో 12,494 కొత్త కేసులు నమోదయ్యాయి. 64 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
నాగ్‌పుర్ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు పడకలు సరిపోక ఒకే బెడ్‌పైన ఇద్దరు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనిపై స్పందించిన నాగ్‌పుర్ జీఎంసీ ఆసుపత్రి సూపరింటెండెంట్.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి రోగులు తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు.
వారాంతపు లాక్‌డౌన్..
కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల మధ్య ఆంక్షలు విధించనున్నారు.