తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా 'మహా' విలయం- మరో 56వేల కేసులు - మహారాష్ట్ర కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 56,647 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 669 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 37,733 కరోనా కేసులు వెలుగు చూశాయి.

Maharashtra cases
మహారాష్ట్రలో కరోనా కేసులు

By

Published : May 2, 2021, 8:45 PM IST

Updated : May 2, 2021, 9:26 PM IST

దేశంలో కొవిడ్​ కల్లోలం కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఆదివారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 56,647 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 669 మంది మరణించారు. ఒక్క పుణె జిల్లాలోనే..11,661 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​ కారణంగా మరో 159 మంది మరణించారు. ముంబయి నగరంలో 3,672 మందికి కరోనా సోకగా.. మరో 79 మంది ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో కొత్తగా 37,733 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​ ధాటికి మరో 217 మంది మృతి చెందారు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు..

రాష్ట్రం తాజా కరోనా కేసులు తాజా మరణాలు
రాజస్థాన్ 18,298 159
తమిళనాడు 20,768 153
కేరళ 31,959 49
ఉత్తర్​ప్రదేశ్​ 30,983 290
గుజరాత్ 12,978 153
మధ్యప్రదేశ్ 12,662 94
బంగాల్ 17,512 103
దిల్లీ 20,394 407

ఇదీ చూడండి:'దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్​ చేపట్టండి'

Last Updated : May 2, 2021, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details