మహాశివరాత్రి సందర్భంగా ఒడిశాలో 55 అడుగుల శివలింగం రూపుదిద్దుకుంది. కలహండి జిల్లా గోలముండా ప్రాంతంలో భక్తులు నిర్మించిన ఈ మహాలింగం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఈ శివలింగ నిర్మాణానికి గ్రామస్థులు విరాళాలు సేకరించారు. కేవలం రెండున్నర నెలల్లోనే ఇది రూపుదిద్దుకోవడం విశేషం.